Thursday, February 21, 2008

చిన్న జీవితం

కల్మషం వద్దు... కలహం అసలే వద్దు...

ఐదారడుగుల చోటు మాత్రమే వున్న మనకు.. ఈర్ష్యకు మరో అడుగు చోటు ఎందుకు...

కయ్యమెందుకు ఒకరితో... కలిసి సాగుదాం అందరితో...

మీకు తెలుసా...

బాథకీ... ఆలోచనకీ... వున్న తేడా....

ఒకటి ... సమస్యని మాయం చేసే తారక మంత్రం...

మరోకటి... సమస్యని పెంచి..మనల్ని తనలో కలుపుకునే సముద్రం...

సమస్యతో సతమతమౌవద్దు ! సమస్యని ఆలోచనతో సాధించండి !!!

Tuesday, February 19, 2008

నీదే గెలుపు!!!

సాగరంలో కెరటానికి అలుపుండదు...
మదిలో అలలకు అంతముండదు...
నర్తించే నెమలికి నొప్పి వుండదు...
దరి చేరే ఊహలకు దప్పిక వుండదు...
ఆలోచనతో అడుగు వేసే నాకు, ఓటమి వుండదు !!!

Monday, February 18, 2008

అవును...

వీచే గాలికి వేగం వుంటుంది...
నా భావాలకు ఆవేశం వుంటుంది...

కోయ్యెల పాడే రాగంలో తీయదనం వుంటుంది...
నాలో రేగే ఊహల్లో ఉత్తేజం వుంటుంది...

కదిలే అడుగుకు దూరం వుంటుంది...
నా ఆలోచనలకు ఆకాంక్ష వుంటుంది...

Friday, February 15, 2008

స్నేహం...

నా బాథ చెప్పటానికి అది దొరికింది...
నా భాష అర్దం చేసుకోటానికి అది దగ్గర అయ్యింది...
నా భావం పంచుకోటానికి అది చేరువ అయ్యింది...

నా బలం అదేనని దానికి తెలుసు...
నా అడుగు దాని కోసమే అని తెలుసు...
నా ఐశ్వర్యం అదేనని తెలుసు...

దాని పేరే.. స్నేహం !!!

Thursday, February 14, 2008

తపన...

నేను నిశ్సబ్దాన్ని భరించలేను... కనుకనే నిశ్సబ్దాన్ని వినాలని వుంది...
నేను చీకటిలొ వుండలేను... కనుకనే చీకటిని చూడాలని వుంది...
నేను బాథతో గడపలేను... కనుకనే బాథని భరించాలని వుంది...
నేను వొంటరిగా ఎక్కడికి వెళ్ళలేను... కనుకనే వొంటరిగా గడపాలని వుంది...
నేను ముళ్ళ బాటలొ ప్రయాణం సాగించలేను... కనుకనే ఆ బాటలొ పయనించాలని వుంది...

చెయ్యలేను అన్న దాన్ని చెయ్యాలి అన్న తపన వుంది..






చేరగలవు...

నిన్ను కమ్ముకున్న చీకటిని వెలుగుతో తుడుస్తూ
నిన్ను అల్లుకున్న భ్రమని జ్ఞానంతో తొలగిస్తూ
నీ ఆత్మ విశ్వాసాన్ని ఆయుధంగా మలుస్తూ
నీ మనొ నిబ్బరాన్ని నీ అడుగుగా కదిలిస్తూ
నీ గమ్యం సజావుగా చేరాలని ఆశిస్తూ

-- మీ అజయ్