Wednesday, June 4, 2008

మనస్సు

నిన్ను పొందిన నేను...

నన్ను నేను కోల్పోయానా...?
నన్ను నేను మరిచిపోయానా...??

ఏదేమైనా...

నిన్ను పొందిన నేను...

నన్ను నేను తెలుసుకోగలిగాను...!
నన్ను నేను మలుచుకోగలిగాను...!!

Tuesday, April 1, 2008

జ్ఞాపకం...

మరుగైనా కాలేదని బాథ పడతారు కొందరు...
మరువలేనిదని ఆనందపడతారు మరికొందరు...

ఏదేమైనా మనసు వీడని మంత్రం అది...
ఈ జీవ యాత్రలో మనతో సాగే సహచరి అది...

Thursday, February 21, 2008

చిన్న జీవితం

కల్మషం వద్దు... కలహం అసలే వద్దు...

ఐదారడుగుల చోటు మాత్రమే వున్న మనకు.. ఈర్ష్యకు మరో అడుగు చోటు ఎందుకు...

కయ్యమెందుకు ఒకరితో... కలిసి సాగుదాం అందరితో...

మీకు తెలుసా...

బాథకీ... ఆలోచనకీ... వున్న తేడా....

ఒకటి ... సమస్యని మాయం చేసే తారక మంత్రం...

మరోకటి... సమస్యని పెంచి..మనల్ని తనలో కలుపుకునే సముద్రం...

సమస్యతో సతమతమౌవద్దు ! సమస్యని ఆలోచనతో సాధించండి !!!

Tuesday, February 19, 2008

నీదే గెలుపు!!!

సాగరంలో కెరటానికి అలుపుండదు...
మదిలో అలలకు అంతముండదు...
నర్తించే నెమలికి నొప్పి వుండదు...
దరి చేరే ఊహలకు దప్పిక వుండదు...
ఆలోచనతో అడుగు వేసే నాకు, ఓటమి వుండదు !!!